Pages

Wednesday 16 September 2015

17-సెప్టెంబర్ ను అధికారికంగా గుర్తించకపోవడం, తెలంగాణా చరిత్రను, ప్రజా విజయాన్నిఅవమాన పరచడమే

1. కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఉన్న రాజరిక వ్యవస్థ అంతమై, తెలంగాణా ప్రాంతం లో ప్రజాస్వామ్య వ్యవస్థకు బీజం పడిన రోజు.

2.  హైదరాబాద్ స్టేట్ ను పాలిస్తున్న ఒస్మాన్ అలీ ఖాన్, 7 వ నిజాం రాజు,  తన రాజ్యాన్ని ఎలాంటి షరతులు లేకుంట విశాలమైన భారత దేశంలో కలిపిన దినం.

3. దాదాపు 250  సంవత్సరాల కు పైగా హైదరాబాద్ స్టేట్ ను ఏలిన ఏడు తరాల అసఫ్ జహి వంశస్తుల రాజ్యపాలన అంతమైన ఘడియ.

4. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత పోలీస్ చర్య ద్వార 5 రోజుల వరకు సైన్యాన్ని ప్రయోగించి హైదరాబాద్ స్టేట్ ను విలీనం చేసుకున్న రోజు.

5. విదేశాల నుండి భారత దేశం పైకి దండ యాత్ర చేసి వచ్చిన మొఘల్ వంశస్తుల మూలాలు ఉండి, ఇస్లాం మతం ఆచరించే రాజుల ఆఖరి తేది.

6.   భారత స్వతంత్రం చరిత్ర లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అప్పటి వలస పాలకులు ఐన బ్రిటిష వారి కన్నా ఎక్కవుగా హైదరాబాద్ స్టేట్ లోని నిజాం రాజును గద్దె దింపడానికి జరిపిన సాయుధ పోరాట మార్గంలో ఇదొక కీలక ఘట్టం.

7.  సామాన్య ప్రజలు, కవులు, నాయకులూ, ప్రముఖులు ఐన  కాళోజి నారాయణ రావు, దాశరథి, పి వి. నరసింహ రావు, నారాయణరావు పవార్ లాంటి ఎందరో మహా మహుల కళలు నిజమై, నిజాం గద్దె దిగిన రోజు.

8. రాజులను కీర్తించే సాహిత్యాల కన్నా, ప్రజల గొంతుకకే ప్రాధాన్యమిచ్చి విజయం సాదించిన అమృత ఘడియలు.
  "మా రాజు తర తరాల బూజు', "నా తెలంగాణా కోటి రతనాల వీణ' లాంటి ఎన్నో పాటలు ప్రజల నాలుకలపై  నాట్యం చేసిన రోజులు.

9. ప్రజలు కస్టపడి కట్టిన పన్నులను, ప్రజా ధనాన్ని, తన వ్యక్తిగత విలాసాలకు ఖర్చుపెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజు గ చలామణి అయిన వాడు తలవంచిన రోజు.

10. నిజాం రాజు కనుసన్నలలో మతం ఆధారంగా ఏర్పడిన మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MIM) (రజాకార్లు) సంస్థ తన రాజ్య ప్రజలపైనే అత్యంత పాశవికంగా చేసిన దాడులు, దోపిడీ చర్యలకు చివరి రోజు.

ఇట్లాంటి విషయాలను పక్కన పెట్టి, 17-సెప్టెంబర్ రోజును తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించకపోవడం, ఒక మతానికి అంట కట్టి చూడడం, ప్రజా విజయాన్ని, చరిత్రను అవమాన పరచడమే.
బావిషత్తు తరాల వాళ్లకి, వాళ్ళ, వాళ్ళ  పూర్వికుల చరిత్రను దూరం చెయ్యడమే.

తెలంగాణా లో కొంత మంది 17-సెప్టెంబర్ రోజు గురుంచి మాట్లాడమంటే ఆ రోజు తరువాత ఏమైందో వివరిస్తూ విశ్లేషిస్తూ ఉంటారు...ఆ రోజు తరువాత జరిగింది గూడా ఒక చరిత్ర నే, మల్ల అది వేరే భాగం, అంతే గాని ముందు జరిగిన దాన్ని తలచుకుంటే ఒకరు బాధ పాడుతారు అనడం సమంజసం కాదు.

Telangana Govt’s Official Status Denial To  17-September Is Insult To People Victory

1. September 17 marks the end of monarchy and beginning of democracy.

2. The day when Mir Osman Ali Khan, ruler of Hyderabad state, surrendered his kingdom to India unconditionally.

3. The last day of nearly 250 years old Asaf Jahi dynasty rule in the Telangana area.

4. A chapter where Indian government was forced to apply its police and military force for 5 days before it could integrate one if its culturally united land ruled by Muslim ruler.

5. It was the final moments of kings who had roots from middle east and Mughuls on the Indian soil.

6. An important day in the history of Indian communists fighters and books who put an armed struggle against the then Hyderabad state rulers, more than British colonists.

7. A memorable day that was the dream of all the ordinary people who revolted against then Nizam dynasty.

8. The victory of people ‘s literature than praising then rulers one.

9. A day when the then most richest person bowed his head to people’s victory, who collected people’s taxes for his personal luxury.

10. A death day for Islamic rule insisting razaakars ( MIM-Majlis-e-Ittehadul Muslimeen)  party which was permitted by Nizam to exploit Hindu people in his kingdom.

By keeping away all this points and trying to suppress the importance of September 17, the government of Telangana is literally trying to distance its glorious historical fight against then rulers and insulting all sections of people whoever participated with a dream of freedom from brutal Nizams.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...