Pages

Saturday 31 October 2015

ఇస్లామిక్ స్టేట్ తీవ్ర వాద సంస్థ ను సమర్దిస్తున్న వార్త విశ్లేషకులు

వేణుగోపాల స్వామి గారు నమస్తే తెలంగాణా పత్రికలో 14-అక్టోబర్-2015 నాడు "ఉద్యమకారుల ఊరేగింపు "  అనే పేరు మీద రాసిన వ్యాసం తెలంగాణా పాఠకులను తప్పు దోవ పట్టించే విదంగా ఉంది.

దాంట్లో వేణుగోపాల స్వామి గారు రాస్తూ ఇస్లాం మతం ఆపదలో ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవాలని అనే ఉద్దేశం తో ఉన్న వారు  ఐ ఎస్ లో సభ్యులుగా  చేరి పోట్లాడటం లో తప్పు లేదు, వాళ్ళు చేసే త్యాగాలను గూడా కించ పరచ వద్దు అని చెప్పుతునారు. ప్రపంచం నలుమూలల నుంచి ముస్లిం లు ఐ ఎస్ తరుపున పోరాడడం లో తప్పు లేదు అని బోధిస్తాన్నురు.

namasthe telangana 14 oct1

దీని ద్వార ఏమి అర్ధం చేసుకోవాలి, ఇస్లాం కు తీవ్రవాదానికి సంబంధం ఉండడంలో తప్పు లేదు అని చెప్పాలి అనుకుంటున్నారా, లేదా ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తుంటే దాన్ని మతం కోణంలో చూడామణి చెప్తున్నట్టా.. మీరు ఎ దేశం నాగరికులు అయిన సంబధం లేదు కానీ యుద్ధం చెయ్యవలసి వచ్చు నప్పుడు మాత్రం మతం ఆధారంగా చెయ్యమని చెప్పుతున్నట్టా? 

కానీ సమాజం లోని కొంత మంది పెద్ద మనుషులు ఐ ఎస్ అనేది ఒక తీవ్రవాద సంస్థ. మతాన్ని దానితో ముడిపెట్టడం సరికాదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇస్లాం కి వ్యతిరెంకంగా పని చేస్తున్నారు అన్నట్టు మనం వింటూ ఉన్నాము.  ఇది మనం సర్వ సాదారణంగా అన్ని వర్గాల నుండి వినే మాటలు. దీని మీద కొంత మంది ముస్లిం లు  కూడా ఐ ఎస్ కు ఇస్లాం కు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు.

ఒక మత పరంగా, లేదా దేశ పరంగా జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర అని చెప్పుతూ, ఈ రెండు విషయాలకు ఎలాంటి సంబందం లేని తెలంగాణా విషయాన్నీ జోడించి విశ్లేషణ పేరు మీద సమాజాన్ని తప్పు దోవ  పట్టిస్తున్నట్టు కనపడుతుంది.

ఇప్పుడు వ్యాసకర్త వేణుగోపాల స్వామి గారు చెప్పింది నిజామా, లేదా మిగితా సమాజం చెప్పింది తప్పా?

ఇంలాంటి విశ్లేషణల ద్వార తెలంగాణా ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు?  

మతానికి తీవ్రవాద సంబధం ఉండడం లో తప్పు లేదు అని చెప్పాలి అనుకుంటున్నారా?

ఇట్లాంటి వాళ్ళ రాతలల్లో ఏమైనా కుట్ర దాగి ఉందా? 

అ రోజు వచ్చిన పూర్తి వ్యాసం

namasthe telangana 14 th october

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...