Pages

Sunday 20 March 2016

“భారత్ మాతా కి జై” అని కొంత మంది ముస్లిమ్స్ ఎందుకు అనరు? “దార్-ఉల్-హర్బ్” “దార్-ఉల్-ఇస్లాం” అంటే ఏంటిది?

“నా మెడ మీద కత్తి పెట్టిన కూడా నేను భారత్ మాతా కి జై” అన అని అసదుద్దిన్ ఒవైసీ అంటే, హైదరాబాద్ కు చెంది జామియా నిజామియా అనే సంస్థ “భారత్ మాతాకి జై” లాంటి నినాదాలు ఇస్లాం కు వ్యతిరేకం అని ఫత్వా కూడా జారి చేసింది. దీనికి వివరణగా కొంత మంది ముస్లిమ్స్ సోషల్ మీడియా లో భరత్ మాత అంటే హిందువులు పూజించే దేవత కాబట్టి , ఖురాన్ ప్రకారం మాకు “అల్లాహ్ “ మాత్రమే దేవుడు, ఇంకొకరిని మేము ““అల్లాహ్“ కు సమానంగా గుర్తించలేము కాబట్టి మేము “భారత్ మాతాకి జై” అనం అని సమర్ధించుకుంటున్నారు. 

అంటే హిందువులు తాము జీవిస్తున్న దేశాన్ని తమకు ఇష్టమైన ఒక దేవతగా కొలవడం ఇక్కడ ఉన్న కొంత మంది ముస్లిమ్స్ సమ్మతం కాదు అట్లాంటి హిందువుల మనోభావలతోటి ఎలాంటి సంబధం గాని గౌరవం గాని లేదు అనే పరోక్షంగా చెప్పడమే.

ఇట్లాంటి వాదనలు విన్న ప్రతి సారి డాక్టర్ అంబేద్కర్ పాకిస్తాన్ ఏర్పాటు పై మరి ముక్యంగా ముస్లిమ్స్ పై చేసిన వ్యాఖ్యలను మనం నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉన్నది అనిపిస్తది.

ప్రతి ముస్లిం కి హిందువు ఒక కాఫిర్ ( ఇస్లాం ని నమ్మని వాడు ). కాఫిర్లు ద్వార నడపబడుతున్న ప్రతి రాజ్యం కూడా  “దార్-ఉల్-హర్బ్” ( అంటే ముస్లిమ్స్ కి యుద్ధం చేస్తున్న భూమి అని అర్ధం), దీని ప్రకారం అక్కడ నివసిస్తున్న ముస్లిమ్స్ ఏ విధంగా నైన సరే అట్టి ప్రాంతాన్ని లేదా రాజ్యాన్ని “దార్-ఉల్-ఇస్లాం” ( కేవలం ముస్లిమ్స్ నివసించే ప్రాంతం) గా మార్చడానికి పని చేస్తారు అని చెప్పడం జరిగింది.

అంటే ఇప్పుడు “భారత్ మాతా కి జై” అనం అని నినదిస్తున్న ముస్లిమ్స్, తమ తమ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుంట దార్-ఉల్-ఇస్లాం గా మార్చే ప్రయత్నాల్లో భాగమే అని అర్ధం చేసుకుంటే భరత్ దేశాన్ని “దార్-ఉల్-హర్బ్” - “దార్-ఉల్-ఇస్లాం” అనే దృష్టి తో చూసే వాళ్ళను గుర్తించి ఇప్పుడు ఉన్న మన దేశంలో ఇట్లాంటి వాళ్ళకు , వాదనలకు స్థానం లేదు అని గట్టిగ చెప్పుతూ చేతల్లల్లో కూడా చూపాల్సిన అవసరం ఉన్నది.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...