Pages

Monday 15 February 2016

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ ద్వంద నీతి

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఒక సినీ నటుడు అయిన షారుఖ్ ఖాన్ కారు పై కొంత మంది రాళ్ళూ విసిరితే దానికి ప్రాముక్యత ఇచ్చి ఇట్లాంటి దాడులు దేశానికి మంచివి కావు అని , ప్రముఖ వార్తల్లల్లో ప్రసారం, పత్రికల్లోలో మొదటి పేజి లో వార్తలను అందిస్తూ చాల మంచి పని చేస్తున్నాయి. దానితో పాటు దాడికి పాల్పడింది ఎవరు, వాళ్ళు ఎ సంస్థ కు చెందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలాంటి నినాదాలు ఇచ్చినారు, అని తమదైన దోరణిలో విశ్లేషణలు అందిస్తూ ఉంటారు. ఈ సంఘటన ఫిబ్రవరి 14 నాడు జరిగితే, మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 15 నాడు మొదటి పేజి వార్తగా ప్రచురించినారు. ఇట్లాంటివి చదివినప్పుడు లేదా చూసినప్పుడు పత్రిక ల వాళ్ళు చాల మంచి పని చేస్తున్నారు అనిపిస్తది. తప్పకుండ అభినందిచాల్సిన విషయం. 



కాని అదే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, మల్ద జిల్లలో కలియ చౌక్ అని ప్రాంతంలో ప్రభుత్వ ఆస్థి అందులో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ స్టేషన్ పై దాదాపు 2 లక్షల మంది ముస్లిమ్స్ దాడి చేస్తే మాత్రం కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటాయి, అక్కడ  ఉన్న కార్లు, బండ్లు, ఇండ్లు కాలపెట్టుతే మాత్రం తెలువదు. అసలు అట్లాంటి వార్త ను పత్రిక మొత్తం ముందు వెనుక తిప్పిన, లేదా ఏదైనా టీవీ ఛానల్ 24 గంటలు చుసిన మాత్రం కనపడదు ఎందుకో? ఈ సంఘటన 3-జనవరి-2016 నాడు జరిగింది, కాని మరుసటి రోజు కాదు గాదా? తరువాతి మూడు నలుగు రోజుల వరకు కూడా ఈ వార్త రాలేదు, అసలు అట్లాంటి దాడి జరిగినట్టు గూడా సామాన్య పాఠకుడికి తెలువకుండా జాగ్రత్త పడ్డరు? ఎందుకో? వాళ్ళు ఎలాంటి నినాదాలు ఇచ్చినారు, ఎలాంటి విధ్వంసం చేసినారు, అసలు వాళ్ళు రోడ్ల మీదికి ఎందుకు రావలసి వచ్చింది, దాని వాళ్ళ దేశంలోని ఏమైనా ఇబ్బందా? అనే విషయాలు విశ్లేషణలు మాత్రం కనపడవు? ఎందుకో? అట్లాంటి సంధర్బంలో పత్రికల వాళ్ళ రాయకుండా ఎవరు చేతులు కట్టి పెట్టుతున్నారు? టీవీ వాళ్ళును ఎ స్వీయ నియంత్రణ చట్టం ఆపుతుంది? విశ్లేషించడానికి ఎవరు అడ్డుపడుతున్నారు? 


ఎట్లా రాసిన పత్రిక కొని చదువుతారు కాదా అనే ధీమా కావచ్చు, ఇది నిజమే, కాని పత్రిక మీద విశ్వాసం ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అయిన  ప్రతిసారి కొద్ది కొద్దిగా విశ్వాసం తగ్గుతూ ఉంటది.....అంతే!  

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...