Pages

Tuesday 5 May 2015

టీఆర్‌ఎస్ రాజకీయ శిక్షణ తరగతుల తర్వాత తెలంగాణా లో తెలుగు భాష బలపడుతుందా?

 
-రాష్ట్ర అధికారిక చిహ్నం లో తెలుగుకి రెండో ప్రాముఖ్యత
-రాష్ట్ర అధికారిక ఉత్తర్వుల్లల్లో తెలుగు జాడే కనపడదు.
-అధికారక వెబ్ సైట్స్ లో ఇంగ్లీష్ దే రాజ్యం
-పోలీస్ బండ్ల మీదే ఒక్క తెలుగు ముక్క లేదు.
-పట్నం లో దుకాణంల పేరులో తెలుగు  ఉండదు !
-2000 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న బాష, 20 సం!! లలోనే పరాయి బాషకు ఓడిపోవాల?
-ఇంగ్లీష్ వాడు చెప్పిందే వేదం, ఇన్నదె పురాణం అనుకోవాలన?
-ఇంగ్లీష్ ను ఉపయోగించడం లో తప్పు లేదు, అట్లా అని  నా బాషకు బొంద పెట్టాలన?
 
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గారు రెండు రోజుల క్రితం నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ శిక్షణ తరగతుల్లో మాట్లాడుతూ ప్రస్తుతం మనం ఒక గొప్ప చారిత్రక సందర్భంలో ప్రజాప్రతినిధులుగా ఉండడాన్ని అదృష్టంగా భావించాలని, ఈ అవకాశాన్ని ప్రజాసేవకు గొప్పగా వాడుకుని చరిత్రలో నిలిచిపోవాలని చెప్పిండ్రు. ఇది కాదనలేని సత్యం.
 
ఈ సమావేశాలలో ఒక సంధర్బంలో తెలుగు భాష మీద మంచి పట్టు, అభిమానం ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గారు, ప్రజా ప్రతినిదులను , అధికారులను, సామాన్యులకు అర్థం అయ్యే బాషలో మాట్లాడడం అవసరం మరియు ఉపయోగకరం, చెప్పినవారికి, విన్నవారికి ప్రయోజనకరం అన్నారు. "ఇది నిజం" , బంగారు తెలంగాణా సాధనలో భాష కు ఉన్న విలువ తెలుసు కాబట్టి దీంట్లో ఉన్న భావానికి రంద్రాన్వేషణ శూన్యం. 
 
కానీ ఒక్కసారి ప్రస్తుత పరిస్థితులలను చూద్దాం. ఇక్కడే తెలుగు పుట్టింది, పెరిగింది, ఇంకా తన జీవనాన్ని కొనసాగిస్తుంది, ముందు తరాలవారికి అందిస్తాది, దీంట్లో అనుమానం లేదు, కాని ప్రస్తుత పరిస్థితిలలో తెలుగు భాష ప్రయాణం ఎట్లా ఉన్నది అనేది సమస్య.
 
ఉమ్మడి రాష్ట్రంలో అధికారికంగా విస్మరించిన తెలుగు భాష ప్రాముఖ్యతను,   తెలంగాణా రాష్ట్రము కూడా పాటిస్తున్నట్టు కానాస్తంది. మనం సగర్వంగా మాట్లుడుతున్నాం సరే, కానీ ఎందుకు దాన్ని రాస్త లేము? 60 ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న మన రాష్ట్ర అధికారిక చిహ్నం లో గూడా పరాయి భాష ప్రాముఖ్యత ముందు నా తెలుగు కిందికే ఉన్నది , ఏడికి అన్న పోయి, మేము కస్టపడి మా అస్తిత్వాన్ని సాధించుక్కున్నం, ఇగో గిదే మా రాజ ముద్ర అంటే, ఇంగ్లీష్ లో ఉన్న దాన్ని చూసి నవ్వు రాదా? 
 
logo

భాష తెలిసిన వాళ్ళను కలుపుతుంది లేదా దూరం చేస్తుంది, కాదు అనుకుంటే ఇద్దరికీ తెలిసిన వేరే భాషలోకి పోవాలి, ఇగ మాట ముచ్చట దాంట్లనే. లేదంటే నువ్వు అటు , నేను ఇటు. పక్కోడికి బాగా అర్థం అయితంది అని నేను నా భాష ను పురగా పక్కకు పెట్టాలన? ఇంకా గిట్లనే జెత్తే, ఒక తరం తరువాత మనం గిది అని చెప్పుకునే అస్తిత్వాన్ని కోల్పోమా? పక్కోడు తోడ కోసుకుంటే మన మెడ కోసుకోవాల? ప్రపంచం అంగీకరిస్తున్న ఇంగ్లీష్ ను మనం ఉపయోగించడం లో తప్పు లేదు, అట్లా అని మొత్తం నా భాషకు బొంద పెట్టాలన? 
 
ప్రభుత్వం విడుదల చేసే ఉత్తర్వుల్లల గూడా తెలుగు ఉండదు, మరి గట్లయితే అది సామాన్య జనాలకు ఎట్లా ప్రయోజనం? ఊర్లల్ల పట్టుకొని చదివే పేర్ల జాబితాల గూడా నా భాషల ఉండదు, ఇగ అది మనలను దగ్గరకు చేసినట్ట? ఇంగ్లీష్ ఒచ్చినోడు, కొండెక్కి కుసుంటాడు, ఇగ వాడు చెప్పిందే వేదం, మేము ఇన్నదె పురాణం. ఎవరైనా పెద్ద మనిషి వస్తే సాలు, వందల ఎనుబై ఇంగ్లీష్ పదాలే ఉంటాయి ఎందుకో? ఒచ్చినోడు చిన్న సూపు సుత్తడన, లేక మాట్లాడే భాష మీద మనకు గర్వం లేకనో తెలువదు. ప్రజా సమస్యల గురుంచి ప్రజల భాషల ఎందుకు మాట్లాడ లేక పోతున్నాం? ఇంకా పెద్ద దరకాస్తు పెట్టాలి అనుకుంటే, ఎలి ముద్రోనికన్న అధ్వాన్నం, అది ఒచ్చినొని సుట్టు ప్రదిక్షణ చెయ్యాలి.
 
 
GO s

ఇగ మన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ళ్లకు కొత్త బండ్లు ఇచ్చిండ్రు, కాని దాని మీద ఒక్క తెలుగు ముక్క లేదు, ఎందుకో? పోలీస్ గూడా మన పదం కాదాయె, రెండు వేల సంవత్సరాల చరిత్రల దానికి తగ్గ పదం మన తాడ లేదా? మా ఊర్ల గా బండి తిరిగిన ప్రతి సారి, ఇంగ్లీష్ బాషకు మొక్కాలి అనిపిస్తది, ఇంగ్లీషోడు ఇక్కడ లేకుంట నే మనలను వాడి బాషకు కూలోళ్ళను చేసిండు, నా బాషను కత్తి లేకుంటనే సప్పుడు చేయకుంట సంపిండు అని. 
 
police vehicle
 

ఇప్పుడు ఉన్న కాలంల, ఇంటర్నెట్ (ఇగ సరే-అంతర్జాలం ) వెబ్ సైట్ లు ఉన్నాయ్, మన తెలంగాణా ప్రభుత్వానికి సంబంధిచిన వివరాలు, వాళ్ళు చేస్తున్న పనులు ఎప్పటికి అప్పుడు చెప్పడానికి అధికారికంగా ఉపయోగిస్తారు, వాళ్ళే దాన్ని మంచి చెడ్డలు చూస్తారు. అవ్వి సూద్దాం, మనోళ్ళు ఏమి రాశిన్ద్రో అని సూత్తే ఏమున్నది, దాంట్ల గూడా ఇంగ్లీష్ దే రాజ్యం.  
 
ముఖ్యమంత్రి, ఇతర శాఖల వివరాలు చూద్దాం అంటే గంతే, నీకు ఇంగ్లీష్ రాదు పోరా అని, ఎక్కిరిత్తనట్టే ఉంటది. ఇగ ఎంతో కొంత ఎ బి సి డి ల సదువుకున్న వాడు అయితే, "దీన్ తల్లి! మన బాషను మనం రాసుకోలేని అద్వాన్న స్థితిలో ఉన్నామా", అని బాధతోటి ఎడువల్నో, కూలోడు కొత్త పని నేర్చుకున్నట్టు, ఇంగ్లీష్ నేర్చుకొని, తల దించు కోవల్నా తెలువదు. పోనీ ప్రస్తుతం మన బాష కంప్యూటర్ లకి ఎక్కలేదు అంటే , అది కూడా కాదాయె. మరి ఇది ఎవరి తప్పు? ఏమైనా సామాన్య ప్రజలకు చెప్పెద్దు అనే రహస్యాలు ఏమైనా ఉన్నాయా?
 
tg site
 

ఇగ ఇప్పుడు ఊర్లల్ల 10 సదివి, పట్నం పోతే వాడి అద్వాన్నం, ఒక్క దుకాణం మీద గూడా తెలుగు లో రాసి ఉండదు ఆయె, ఇగ దాంట్లకు పోయి ఏమైనా కొందాం అంటే సుత, అమ్మేటోడూ, పని చేసి టోడూ, ఇంగ్లీష్ ల మాట్లుడుతడు, 'ఇగ మనకు ఇంగ్లీష్ రాదు' అని తెలువంగానే పళ్ళు ఇకిలిత్తడు. పోనీ వాడికి తెలుగు రాదా  అంటే కాదు, వాడు మనోడు, రామ సక్కనైన తెలుగు మాట్లుడుతడు.

ఇదేం గోసనో ఏమో, 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నది అని సంకలు గుద్దుకునుడే గాని, ఒక్క 20 సంవత్సరాల గిట్ల బాషల ఓడిపోతం అనుకోలే. మరి బంగారు తెలంగాణా ను కూడా "గోల్డెన్ తెలంగాణా" అని రేపు ఎవడైనా టీవీ డబ్బల్లల వచ్చి మొత్తుకుంటే, ఇగ సాల్! అనుకోవాలన?

తొలి అడుగులు బాషను విస్మరిస్తే, కొంత కాలానికి ఎనుకకు రానంత దూరం పొతం అనే భయం. మన రాష్ట్రంలనే  మన భాషనూ మనం ఉపయోగించుకునే పరిస్థితులలో లేమా?

కాని నా తెలంగాణా కోటి రత్నాల వీణ, దీని రాగం వినడానికే కాదు, రాయడానికి, తల్లి గోరు ముద్దలు తిని పిస్తున్నట్టు ఉండాలి, దోసిల్లల్లో తేనె తాగుతున్నట్టు తాగాలి అని మన తొలి తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుకుంటున్న.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...