Pages

Sunday 22 March 2015

అధర్మం వైపు చూస్తున్న కే. సి.ఆర్.


కే. సి.ఆర్, బహు ముఖ ప్రజ్ఞ్య శాలి, మేధావి, అన్నిటికన్నా ముఖ్యంగా ఎత్తులకు, పై ఎత్తులు వేయగల రాజకీయ నాయకుడు, ఇది సాదారణంగా చాల మంది అంగీకరించే విషయం. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు లో తన పాత్ర అనిర్వచనీయం. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి గా తన విధులు తన ఆలోచనలకూ అనుగుణంగా రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇది ఇంకా 5 సం’ కొనసాగుతుంది.
  
కే. సి.ఆర్ చెప్పనట్టు ఇక్కడి ప్రాంతానికి ఒకప్పుడు నిజాం రాజు, ఇది సత్యం, దీంట్లో ఏమి అనుమానం లేదు, కాని నిజాం గొప్ప రాజు అని కీర్తించడం మాత్రం నా దృష్టిలో తప్పే. ఇంకా ఏమి అంటారంటే ఒక రాజు తన రాజ్యాన్ని కాపాడు కోవడానికి శతవిధాల ప్రయత్నించిండు, కాని సఫలికృతం కాలేదు అని చెప్పుతారు. ఇక్కడనే అంత వుంది ఒక రాజు యొక్క గొప్ప నీతి.
 
రాజు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి శత్రువుల మీద దాడి చేసి, వారి తోటి యుద్ద భూమిలో ఓడిపోయిండా?
 
నిజాం పాలిస్తున్న రాజ్యం లోని ప్రజలు ఏమైనా సుఖ సంతోషాల తోటి జీవించినారా?
 
100 పైగా పన్నులు వేసి నిర్ధాక్షన్యంగా వసూలు చేయడం గొప్పనా? రాజు మొహం చూస్తే చాలు “నజరానా” పన్ను కట్టాలని వసూలు గొప్పనా?
 
ప్రజలు తమ రక్త మాంసాలు ఏకం చేసి కట్టిన పన్నులను రాజ్య హితం గురుంచి ఖర్చు పెట్టకుండా తన విలాసాలకు ఉపయోగించుక్కన నిజాం రాజుది ఎం గొప్ప?
 
ప్రపంచ దేశాలను భ్రష్టు పట్టించిన అతి ఘోరమైన భూస్వామ్య వ్యవస్థను పెంచి పోషించిన రాజు ఏ విదంగా గొప్ప వాడు?
 
తన రాజ్యం లోని కొన్ని వేల మంది ని చంపడం గొప్పనా?
 
ఖాసిం రజ్వి లాంటి రాక్షసులను పెంచి పోషించడం ఎ ప్రామాణికంగా గోప్పనో మరి?
 
అక్షరాస్యత నే “అంటరానితనం” అని భావించి ప్రజలకు చదువులను దూరం చెయ్యడం గొప్పనా?
 
తన ప్రాంత ప్రజల మనోభావాలకు సంబధం లేకుండా తన రాజ్యాన్ని ఎక్కడో ఉన్న మత ప్రాతిపదకన ఏర్పడ్డ పాకిస్తాన్ తోటి కలుస్తాం అనడం గొప్ప నిర్నయమా?
 
మతం పేరు మీద తన రాజ్య ప్రజలను చంపినవాడు ఏ విధంగా గొప్ప వాడు?
 
ప్రజలు సంతోషంగా ఉంటె రాజుకి కీర్తి వస్తుంది, కాని ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నపుడు గూడా రాజునే కీర్తించే వాళ్ళను, తొత్తులు , అవకాశ వాదులు అనడం లో తప్పు లేదు కాదా?
 
కే. సి.ఆర్ ధర్మ పక్షమైన తెలంగాణా బోనం ఎత్తుకున్నపుడు జేజేలు పలికినారు తన వెంట నడిచిండ్రు, కాని రాక్షస రాజు అయిన నిజాంను వాడి తోత్తులైన ఎం.ఐ.ఎం తో అధర్మం వైపు నిలబడుతే ఓటమి, అపకీర్తి కూడా సహజం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...