Pages

Sunday 25 December 2016

తెలంగాణాలో డబుల్ బెడ్ రూమ్ పథకం కేవలం కే.సి.ఆర్ దత్తత గ్రామాలకేనా?



బంగారు కత్తి అని మెడ కొసుకోము కాదా! కాని ఈ మధ్య బంగారు తెలంగాణా నిర్మాణంలో కొన్ని గొంతుల వాదనల విన్న తరువాత కొద్దిగా తేడా అనిపిస్తాంది.

కే.సి.ఆర్ దత్తత తీసుకున్న ఎర్రవెల్లి, నరసన్నపేట లో ఒక్క సంవత్సరం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టడం, ఇటీవలే (23 డిసెంబర్ , 2016) నాడు ఊరు ఊరంతా ఒకే రోజు గృహ ప్రవేశం చేయడం, చాలా సంతోష కరమైన వార్త....  




కాని రెండు విషయాలు:  

డబుల్ బెడ్ రూమ్ పథకం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక పథకం, కేవలం కేసిఆర్ వ్యక్తిగతమైనది కాదు, ఇంకోటి కేసిఆర్ ఒక్కడే గ్రామాలను దత్తత తీసుకోలేదు. చాల మంది అధికార పార్టీ MLA, MP, MLC లు ఎదో ఒక ఊరు ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పిన వాళ్ళే. 

తెలంగాణా లో 90 మంది TRS MLA లు,  11 MP లు, 18 MLC లు.  అంటే తలా ఒక్క ఊరు దత్తత తీసుకుంటే, కనీసం 100 ఊర్లల్ల అయిన ఈపాటికి  డబుల్ బెడ్ రూమ్ పథకం, గృహ ప్రవేశాలు ఒక సంవత్సరంలో పూర్తి అయ్యేటివి. మరి ఎందుకు కాలేదు? 

బంగారు తెలంగాణా నిర్మాణం తొందరగా అయ్యేది కదా...

పథకం ఒకటే, చేతిలో ఉన్న పరిపాలనతో MLA, MP, MLC లు అందరికి చేయగలగే అవకాశం ఉన్న అంశం. మరి కేవలం కేసిఆర్ దత్తత తీసుకున్న ఊర్లనే ఈ పథకం ఎట్లా అమలు అయింది? మిగితా ప్రాంతంలో ఎందుకు కాలేదు? ( ఇంతకు ముందు హైదరాబాద్ ల ఒకటి అయింది) అధికారంలో ఉన్న MLA, MP, MLC ల నిర్లక్షమా? అధికారుల అలసత్వమా? అంటే కే.సి.ఆర్ ఒక్కడే మంచోడు, మిగితవాళ్ళు కాదా? పథకం అమలుకు పైసలు లేవా? మిగితా వాళ్ళకు ఆలోచన లేదా?

కారణాలు ఏందో...

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...