Pages

Wednesday 8 June 2016

విద్యా వ్యవస్థ లో కొన్ని మార్పుల ద్వార బంగారు తెలంగాణా ప్రశ్నార్ధకమే

సమాజం లో మానవ సంబంధాలే ప్రాధాన్యం. కుటుంబ బంధుత్వాల తరువాత ఇవి ఎక్కువగా  ప్రాథమిక విద్యార్ధి దశలో ఏర్పడి జీవితాంతం కొనసాగుతాయి. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో చేపటుతున్న కొన్ని మార్పులు చేర్పులు ఆహ్వానించదగ్గవె, కాని SC/ST/BC కులాలకు, మైనారిటీ మతాలకు చెందిన వారి కోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్కూల్స్, హాస్టల్స్, గురుకులాలు ఏర్పాటు చేసి, తగినన్ని ఆర్థిక వనరులు సమకూరుస్తుంది. ఇలాంటి మార్పు ద్వార భవిషత్తులో కుల మతాలకు అతీతంగా ఆలోచించే తెలంగాణా సమాజం నిర్మాణం అవుతుందా అనేది పెద్ద సందేహమే.  




భారత సమాజంలో కులాల మద్య అంతరాలు ఉన్న మాట వాస్తవమే, కాని ఆ అంతరాలను నిర్మూలించడానికి ప్రయత్నాలు చేయాల్సింది, కాని కులాన్ని, మతాన్ని బట్టి వాళ్ళ గుణ గణాలను సిద్ధాంతీకరించే ఉపాద్యాయులు, ప్రొఫెసర్లు, కుల సంఘాల నేతలు మన దగ్గర చాల మందే ఉన్నారు. ఫలానా కులం వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తారు, కొన్ని కులాలను వర్గాలుగా విభజించి వర్గ పోరాటం చెయ్యాలి అని ప్రోత్సహించే వాళ్ళు, ఒక కులం వాడి జీవిత లక్షం ఇంకో కులం వాణ్ణి ఎదగ నీయకుండ తొక్కడం అని , విద్యార్థులకు ఎక్కువ, తక్కువ, అగ్ర, నిమ్న కులాలు, దళిత బహుజనులు, మైనారిటీ మతాలు, బ్రాహ్మణ వాదం, దళిత వాదం అంటూ హక్కులు, పోరాటాలు, వర్గ ఆదిపత్య కుట్ర సిద్దంతాలు, ఆర్య ద్రావిడ సిద్దంతాలు అని విభజించి విద్యా బుద్ధులు చెప్పే ఉపాద్యాయులు, ప్రొఫెసర్లు, ద్వార ఇట్లాంటి స్కూల్స్, హాస్టల్స్ లో చదువుకున్న విద్యార్థులు సమీప భవిషత్తులో సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతారో సులబంగా ఉహించుకోవచ్చు.

ప్రస్తుతం యూనివర్సిటీ స్థాయిలో ఉన్న బీఫ్ ఫెస్టివల్ (పెద్ద కూర పండుగ), రావణాసుర వర్ధంతి, దళిత బహుజనుల బతుకమ్మ,  మా మత దేవుడే గొప్ప, మిగితా వాళ్ళు చెప్పేది అంత తప్పు, మతం మార్పిడిలు, హిందూ మత దేవతలు రాక్షసులు అని ప్రస్తుతం తక్కువ స్థాయిలో వినిపిస్తున్న గొంతుకలు ఇక ముందు కొత్తగా ఏర్పడే స్కూల్స్ హాస్టల్స్ నుండి వితండ వాదం చేసే వాళ్ళు పెరుగుతారు అని అర్ధం చేసుకోవచ్చు.    

ఇట్లాంటి కొత్తగా మార్పులు చేర్పులు చేస్తున్న విద్య వ్యవస్థ ద్వార 15-20 సం.ల తరువాత ఒక కొత్త వాదన కూడా రావచ్చు. ప్రస్తుతం కే.సి.ఆర్ నేతృత్వం లో ఉన్న తొలి తెలంగాణ ప్రభుత్వం అగ్రకులాల చేతిలో ఉండడం వలన మిగితా కులాల వాళ్ళను శాశ్వితంగా సమాజానికి దూరం చేసి వాళ్ళలో ఐక్యత రాకుండా చేసి తమ ఆర్థిక బలాన్ని పెంచుకుంటూ అధికారాన్ని ఎప్పటకి తమ దగ్గరే పెట్టుకోవడానికి చేసిన అతి పెద్ద కుట్రే ఈ విద్య వ్యవస్థ మార్పులు అని సిద్ధాంతీకరించే వాళ్ళు గూడా వస్తారు. తెలంగాణ అంటే కుల పంచాయితల రాష్ట్రం అని పేరు కూడా రావచ్చు. 

ఒక కులం వారికీ మిగితా వారిమీద ఏదైనా అపోహలు ఉంటె  పరస్పరం చర్చించుకునే అవకాశం చాల తక్కువగా ఉండడం. ఒక వ్యక్తి ని కుల పరంగా గుర్తించాలి అంటే నువ్వు ఏ స్కూల్లో  చదువుకున్నావు అని అడిగితే చాలు, ఒక వేళ జీవనోపాధి గురుంచి రాష్ట్రం దాటి పోతే “ఓహో తెలంగాణాలో విద్య కుల పరంగా నిర్వహిస్తారా” అని అవహేళన చేసే అవకాశాన్ని మనం కల్పించవచ్చు.    

ప్రస్తుతం మన సమాజంలో ఉన్న కంచ ఐలయ్య లాంటి వాళ్ళ శిష్షులు, వర్గ పోరాటం, హింస ద్వారానే సమ సమాజం నిర్మాణం అవుతుంది అనే మావో వాదులు, మా మతమే గొప్పది అని నమ్మే మతోన్మాదులు ఇలాంటి స్కూల్స్ లో ఉపాద్యాయులు అయితే కుల మతాలకు అతీతంగా మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే బంగారు తెలంగాణా నిర్మాణం కావడం అంత సులభం కాదు అనుకుంటా...

కుల, మతం ఆధారంగా స్కూల్స్ నిర్వహించడం అనే ఆలోచన తాత్కాలికంగా కొంత మందికి సంతృప్తి ఇవ్వవచ్చు కాని భవిషత్తులో ఇది వికృత రూపం తీసుకొనే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఈ ఆలోచన ప్రభుత్వంలో ఎవరికి తట్టిందో, ఎవరు బలపరచి ప్రోత్సహించరో కాని వారికీ మాత్రం ముమ్మాటికి ఈ అంశంలో దూర దృష్టి లోపించింది అనేది నా భావన.

కుల, మత ప్రస్తావన లేని స్కూల్స్ , హాస్టల్స్, గురుకులాలు ద్వార బంగారు తెలంగాణా సాద్యం కాదా? 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...